అనంతగిరి: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల వ్యవహరించిన తీరుకు నిరసనగా శుక్రవారం వికారాబాద్‌లోని ఎన్‌టీఆర్ చౌరాస్తాలో బీజేపీ నాయకులు రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందుకు నిరనసగా యూత్ కాంగ్రెస్ నాయకులు మధ్యాహ్నం ఎన్‌టీఆర్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను ఉరి తీసి దహనం చేశారు. అటుగా వెళ్తున్న బీజేపీ నాయకులు మోదీ దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తోపులాటకు దారి తీసింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అటుగా వెళ్తున్న ఎస్పీ స్నేహ మెహ్ర వాహనాన్ని ఆపి స్టేషన్‌కు వచ్చి ఘటనపై ఆరా తీశారు.
మోదీ దిష్టిబొమ్మ దహనంపై ఘర్షణ
ఇరు వర్గాలను అరెస్టు చేసిన పోలీసులు


