కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

మొయినాబాద్‌: పెండింగ్‌ కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దని.. వేగవంతంగా దర్యాప్తు చేసి నాణ్యతతో పూర్తి చేయాలని ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి అన్నారు. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణ, కార్యాచరణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబర్‌ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీటీఎన్‌ఎస్‌, ఈ–సాక్షి వ్యవస్థల వినియోగం, మాదకద్రవ్యాల నివారణ తదితర అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్‌ పరిధిలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ను సందర్శించి రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో చేవెళ్ల జోన్‌ డీసీపీ యోగేష్‌గౌతం, ఏసీపీ కిషన్‌, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జునరెడ్డి, డీఐ ఉపేందర్‌ తదితరులు ఉన్నారు.

ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement