ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

షాద్‌నగర్‌రూరల్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం డీఎం కరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటే టీజేఎంయూ బలపరిచిన నాయకులను గెలిపించాలని అన్నారు. గతంలో రెండు సార్లు టీఎంయూ గెలిచినా కార్మికులకు ఆశించిన ప్రయోజనాలు అందలేదన్నారు. పనిభారం, కిలోమీటర్ల పెంపుతో ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కార్మికుల కష్టాలను పట్టించుకోని నాయకులు ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపఽథ్యంలో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఆర్డీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే లక్ష్యసాధనకోసం పని చేస్తున్న టీజేఎంయూకు మద్దతివ్వాలని కోరారు. అనంతరం సంఘం డిపో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ డిపో గౌరవ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌, అధ్యక్షుడిగా నర్సింలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహేందర్‌గౌడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా శేఖరయ్య, కార్యదర్శిగా శ్రీధర్‌రావు, ప్రచారకార్యదర్శిగా నర్సింహ, కోశాధికారిగా రవి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనయ్య, ప్రధానకార్యదర్శి హన్మంత్‌, కార్యదర్శులు రాజు, ఆర్‌ఎన్‌ రావు, రీజినల్‌ కార్యదర్శి నాగేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement