మోమిన్‌పేట: వెంచర్ ప్రహారీ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మోమిన్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్‌భూషన్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగె నాగయ్య, భాగ్యమ్మ దంపతులు చంద్రశేఖర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడో తరగతి చదువుతున్న కుమారుడు దుర్గాప్రసాద్(8) ఉన్నాడు. స్నేహితులతో కలసి సమీపంలోని వెంచర్ వద్ద ఆడుకుంటున్న క్రమంలో వెంచర్ ప్రహరీ ఒక్కసారిగా కూలడంతో దుర్గాప్రసాద్ శిథిలాల కింద పడిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అంజయ్య సీఐ వెంకట్‌తో కలిసి ఘటనా స్థలిని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు.


