మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి

Jul 13 2026 7:16 AM | Updated on Jul 13 2026 7:16 AM

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి

16న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

తాండూరు: మంత్రుల పర్యటనను జయప్రదం చే యాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నా రు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో పార్టీ ము ఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. నియోజకవర్గంలో నిర్మించను న్న రోడ్లకు రూ.290 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 16న రోడ్డు పనులకు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌లు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. అంతే కాకుండా పట్టణ శివారు జీపీఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభలో తాండూరు బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో భూ ములు కోల్పోయిన భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య, రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి జీపీఆర్‌ గార్డెన్‌ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేయా లని పోలీసు అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement