గడువులోగా పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పూర్తి చేయండి

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

● డిజిటలైజేషన్‌ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు ● కలెక్టర్‌ దీపక్‌ తివారి

కుల్కచర్ల: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను ఈ నెల 20 తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ దీపక్‌తివారి అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలో జ రుగుతున్న సర్‌ ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలన్నా రు. అనంతరం జిల్లా పరిషత్‌ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతితో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆగస్టు 15వ తేదీ లోపు విద్యార్థులకు యూనఫామ్‌ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్‌ ఘని, తహసీల్దార్‌ పురుషోత్తం, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఈఓ అబీబ్‌ అహ్మద్‌, సూపర్‌ వైజర్లు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement