పేరుకే పెద్దాసుపత్రి | - | Sakshi
Sakshi News home page

పేరుకే పెద్దాసుపత్రి

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

మర్పల్లి: పేరుకే 30 పడకల ఆస్పత్రి అని, తగిన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్‌ అన్నారు. శనివారం ఆయన నాయకులతో కలిసి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను సందర్శించారు. సిబ్బంది, రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్తగా సౌకర్యాలు కల్పించకపోగా.. ఉన్న స్కానింగ్‌, ఆల్ట్రాసౌండ్‌ యంత్రాలు పనిచేయడం లేదని, అయినా వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైద్య సేవలు మెరుగు పడటం లేదని పేర్కొన్నారు. చికిత్స అనంతరం రోగులకు అందించాల్సిన భోజనం పెట్టడం లేదని విమర్శించారు. అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలని, వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పరి నర్సింలు, సీఐటీయూమండల అధ్యక్షుడు ఆనందం, సీఐటీయూనాయకులు బాబు, లక్ష్మి, రాజు, మంజుల,అంతమ్మ, పార్వతమ్మ, నిర్మల శ్యామల, అనిత, సంతోశ, కవిత, స్వరూపరాణి, విజయ లక్ష్మితదితరులు ఉన్నారు.

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సీహెచ్‌సీ

రోగుల సమస్యలు పట్టని అధికారులు

సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement