ఎందుకీ పోలీస్‌ యాక్ట్‌ ? | - | Sakshi
Sakshi News home page

ఎందుకీ పోలీస్‌ యాక్ట్‌ ?

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

జిల్లాలో నెలరోజుల పాటు అమలు ఇప్పటికే విధివిధానాలుప్రకటించిన ఎస్పీ స్నేహమెహ్ర మా గొంతు నొక్కేందుకే అంటున్న ప్రతిపక్షాలు భూ సేకరణ కోసమే యాక్ట్‌:ప్రజా సంఘాలు

వికారాబాద్‌: ఎలాంటి సందర్భం లేకుండా జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ –30 అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూలై ఒకటి నుంచి నెలాఖరు వరకు యాక్ట్‌ అమలులో ఉంటుందని జిల్లా పోలీస్‌ బాస్‌ స్నేహ మెహ్ర ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడో.. ఘర్షణలు చోటుచేసుకుంటాయనే అనుమానం తలెత్తినప్పడో ఈ చట్టం అమలు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా కంట్రోల్‌లోనే ఉంది. రాజకీయ పరమైన గొడవ లు, అల్లర్లు, ఇతర ఘర్షణలు లేవు. ఉన్నట్టుండి సీఎం సొంత జిల్లాలో ఈ చట్టం అమలు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించనప్పటికీ అమలు విషయంలో వివక్ష చూపుతున్నారంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. సీపీఎం సైతం కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది.

అమలు తీరుపై విమర్శలు

పోలీస్‌ యాక్ట్‌ అమలులోకి వచ్చి పది రోజులు కావస్తోంది. అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి.అధికార పార్టీ విషయంలో ఓ రకంగా.. ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ముందుస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశా లు నిర్వహించరాదు, ధర్నాలు, రాస్తారోఖో లు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టరాదు. అ యితే అధికార పార్టీ నాయకులకు ఈ షరతులు వర్తించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది మందితో సభలు, సమావేశాలు నిర్వహిస్తు న్నారు. ఇటీవల తాండూరులో కాంగ్రెస్‌ పార్టీ లో చేరికల సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పోగయ్యారు. వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసుల వివక్షపై బీర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు సైతం ఇదే విషయం పోలీసుల దృష్టికి తెచ్చారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ఎస్పీని కోరారు.

భూ సేకరణలో భాగమేనా?

సీఎం,స్పీకర్‌లు ప్రాతినిథ్యం వమిస్తున్న జిల్లా లో అకస్మాత్తుగా పోలీసు యాక్టు అమలులోకి తేవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జిల్లాలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసమే పోలీస్‌ యాక్టు అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంలో 1,200 ఎకరాలు సేకరించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రస్తు తం పరిగి మండలం రాపోల్‌, కాండ్లాపూర్‌, దోమ మండలంలో పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం, కొడంగల్‌ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథ కం కోసం దాదాపు 3,500 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలి పరిగి మండలంలో పెద్ద ఎత్తు న రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టా యి. ఈ నేపథ్యంలో కఠిన నిబంధలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నెలాఖరు వరకు..

జిల్లాలో పోలీస్‌ 30 యాక్ట్‌ నెలాఖరు వర కు అమలులో ఉంటుంది. ముందస్తు అ నుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమా వేశాలు నిర్వహించరా దు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించినా.. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు ఉంటాయి.

– స్నేహ మెహ్ర, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement