గుడ్‌ జాబ్‌ మనోహర్‌.. | - | Sakshi
Sakshi News home page

గుడ్‌ జాబ్‌ మనోహర్‌..

Feb 18 2026 8:36 AM | Updated on Feb 18 2026 8:36 AM

గుడ్‌

గుడ్‌ జాబ్‌ మనోహర్‌..

● రూ.కోటితో షెడ్లు నిర్మిస్తాం ● ఏఎంసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

ఎమ్మెల్యేని ప్రశంసించిన సీఎం రేవంత్‌రెడ్డి

తాండూరు: మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిచి పాలక వర్గం ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని ప్రశంసించారు. బుధవారం నగరంలోని సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.

ఉత్తమ ఫలితాలకు

కృషి చేయండి

డీఈఓ రేణుకాదేవి

కొడంగల్‌ రూరల్‌: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని 10వ తరగతి పాఠాలు బోధించే ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు అందించారు. పూర్తయిన సిలబస్‌ను విద్యార్థులచే పునఃచ్చరణ తరగతులు నిర్వహిస్తూ మెరుగైన మార్కులు సాధించేలా కృషి చేయాలన్నారు. సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అదనపు తరగతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుదురుమల్ల జెడ్పీహెచ్‌ఎస్‌ సందర్శన

దుద్యాల్‌: మండలంలోని కుదురుమల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈవో రేణుకాదేవి సందర్శించారు. పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశామన్నారు.

మార్కెట్‌ యార్డ్‌లో సమస్యలు లేకుండా చూస్తాం

మర్పల్లి: మార్కెట్‌ యాడ్‌లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఏఎంసీ చైర్మన్‌ వై మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్‌ కార్యాలయంలో డైరక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌ యార్డులో రూ.కోటితో షెడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. మోమిన్‌పేట్‌, బంట్వారం మండలాల్లోని మేకల సంతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో రోడ్డు వేయడం ద్వారా రైతులు, కస్తూర్బా, ఎస్టీ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా మారిందన్నారు. ధాన్యం బస్తాల కొనుగోలు చేస్తున్న కమీషన్‌ ఏజెంట్లు, చిరు వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, సిబ్బంది తనిఖీలు చేయాలని ఆదేశించారు. అనంతరం సర్పంచ్‌ రమేష్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌ యాదవ్‌, మార్కెట్‌ కార్యదర్శి వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఆరోగ్య పథకాన్ని పునఃసమీక్షించాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పునః సమీక్షించాలని టీజీఓ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కె రామారావు, శ్రీనేష్‌ కుమార్‌ నోరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీజీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం టీజీఓ సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈఎస్‌హెచ్‌ పైనా ప్రభుత్వంతో రాబోయే రోజుల్లో చర్చలు జరపాలని, వినతులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.

గుడ్‌ జాబ్‌ మనోహర్‌.. 
1
1/2

గుడ్‌ జాబ్‌ మనోహర్‌..

గుడ్‌ జాబ్‌ మనోహర్‌.. 
2
2/2

గుడ్‌ జాబ్‌ మనోహర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement