పట్టరపట్టు.. ఉడుంపట్టు | - | Sakshi
Sakshi News home page

పట్టరపట్టు.. ఉడుంపట్టు

Feb 18 2026 8:36 AM | Updated on Feb 18 2026 8:36 AM

పట్టర

పట్టరపట్టు.. ఉడుంపట్టు

జీవన్గీలో ఆర్భాటంగా అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు భీకరంగా తలపడిన మల్లయోధులు విజేతగా నిలిచిన కర్ణాటక పహిల్వాన్‌ మహేశ్‌ ముగిసిన మహాదేవలింగేశ్వర స్వామి జాతర

బషీరాబాద్‌: మండలంలోని జీవన్గీ మహాదేవలింగేశ్వర స్వామి జాతర మంగళవారం కుస్తీ పోటీలతో అట్టహాసంగా ముగిసింది. ఆల యం ముందు కాగ్నా నది ఇసుకలో నిర్వహించిన కుస్తీ పట్లకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు భారీగా తరలివచ్చారు. భీకరంగా తలపడ్డారు. పదేళ్ల బాలుడి మొదలుకొని నలభై ఏళ్ల వ్యక్తుల వరకు పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్‌లో కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన మహేశ్‌, ఉద్దవ్‌ మన్నె తలపడగా మహేశ్‌ విజేతగా నిలిచారు. తాండూరు తోపాటు కర్ణాటకలోని బీదర్‌,యాద్గీర్‌, గుల్బర్గా, మహారాష్ట్రలోని సోలా పూర్‌, లాతూర్‌ జిల్లాల నుంచి సుమారు 150 జట్లు తలపడ్డాయి. ఆయా స్థాయిలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు.

విజేతలకు ఘన సన్మానం

ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన మహేశ్‌, ఉద్దవ్‌ మన్నెకు ఆలయ కమిటీ తరఫున పూజారి ఓగిపూర్‌ మల్లికార్జునస్వామి సన్మానించి విజేతకు 5 తులాల వెండి కడియం, రన్నర్‌కు మూతు తులాల కడియం తొడిగారు. అనంతరం కలశానికి వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన వడ్ల రాములు రూ.91,100కు దక్కించుకున్నారు. పోటీలకు రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు నుమాన్‌ అలీ, విఠల్‌ రాథోడ్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోటీలను వీక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రామని బసప్ప, ఆలయ కమిటీ పెద్దలు మునీందర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, నర్సిరెడ్డి, మాధవరెడ్డి, కేశవరెడ్డి, వీరారెడ్డి, మల్లప్ప, నరేందర్‌రెడ్డి, రాములు, బాలకృష్ణ, సోమశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పట్టరపట్టు.. ఉడుంపట్టు1
1/1

పట్టరపట్టు.. ఉడుంపట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement