ఓటర్ మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలి
అనంతగిరి: ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఆర్‌డీఓ వాసుచంద్ర, ఎన్నికల సుపరింటెండెంట్ నేమత్ అలీ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
22న గురుకుల ప్రవేశ పరీక్ష
గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 22న పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మ జ్యోతి బాపులే సంక్షేమం, తెలంగాణ గురుకులాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఇతర సమాచారం కోసం సెల్ నంబర్ 9704550225లో సంప్రదించాలని సూచించారు.


