అజ్ఞాతంలోకి పైలెట్‌! | - | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలోకి పైలెట్‌!

Feb 18 2026 8:36 AM | Updated on Feb 18 2026 8:36 AM

అజ్ఞాతంలోకి పైలెట్‌!

అజ్ఞాతంలోకి పైలెట్‌!

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రోహిత్‌రెడ్డిపై కేసులు అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు విషయం తెలుసుకొని అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే

తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘించడం తోపాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న రోహిత్‌రెడ్డి ఈ నెల 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాండూరు, రాయదుర్గం, వికారాబాద్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పైలెట్‌ ఎక్కడికి వెళ్లారు.. ఎవరిని కలిశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోనే ఉన్నారా? లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లారా? అని ఆరా తీస్తున్నారు. నగరంలోని ఆయన నివాసంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. మరోవైపు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినట్లు సమాచారం. అయినా ఆచూ కీ లభించలేదు. ఇదిలా ఉండ గా రోహిత్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పైలెట్‌ సన్నిహితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 2018లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తాండూరు నియోజకవర్గంలో అక్రమంగా విగ్రహాలను ప్రతిష్ఠించడం, రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఓ కేసు, బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడి ఘటనలో కేసు నమోదైంది. అప్పుట్లో బెయిల్‌ పొందిన తర్వాతే తాండూరుకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement