సబ్‌స్టేషన్‌కు స్థల పరిశీలన
బొంరాస్‌పేట: మండలంలోని రేగడిమైలారంలో సబ్‌స్టేషన్, ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి మంగళవారం కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి స్థల పరిశీలన చేశారు. గ్రామ సమీపంలోని దొరచెరువు వద్ద గల ప్రభుత్వ భూమిలో 33/11కేవీ విద్యుత్ స బ్‌స్టేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మాణానికి భూమిని పరిశీలించారు. పక్క నే ఉన్న క్రీడామైదానం అభివృద్ధికి నిధులు ఇవ్వా లని నాయకులు కడా అధికారిని కోరారు. గ్రామంలోని జాతీయ రహదారి 163పై ప్రధాన కూడలిలో రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపా రు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్టెమ్మ, ఉపసర్పంచ్ దాసరి చంద్రప్ప, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుండప్ప, నాయకులు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


