నూతన వంగడాలతో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

నూతన వంగడాలతో ప్రయోజనం

Feb 18 2026 8:36 AM | Updated on Feb 18 2026 8:36 AM

నూతన

నూతన వంగడాలతో ప్రయోజనం

జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం

ధారూరు: సాగులో నూతన పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం సూచించారు. మంగళవారం ధారూరు, గుదోట్ల గ్రామాల్లో నూతన వంగడాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ రాజేందర్‌ మాట్లాడారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలన్నారు. అనంతరం 20 కిలోల చొప్పున వరి విత్తనం, భూసార పరీక్ష కిట్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటేఽశం, సందీప్‌, ఏఓ సూర్యప్రకాష్‌, సర్పంచ్‌లు ప్రమీల, రాములు నాయక్‌, బాలు నాయక్‌, అనంతయ్య, హీరీబాయి, లక్ష్మి, సోమ్లా నాయక్‌, ఏఈఓలు పాల్గొన్నారు.

అంతర్జాతీయ

సదస్సుకు ఆహ్వానం

షాద్‌నగర్‌: ఢిల్లీలో ఈనెల 22, 23 తేదీల్లో శయుక్షక్‌ ఫౌండేషన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ సెమినార్‌ను షాద్‌నగర్‌ పట్టణానికి అర్ధశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సామ రవీందర్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ‘అంబేడ్కర్‌ సొసైటీ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, రీ ఇమాజిన్‌ ఇంటెగ్రల్‌ హ్యూమనిజం ఇన్‌ ది ఏఐ ఏరా’ అంశంపై జరిగే సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యావేత్తలు హాజరు కానున్నారు.

నూతన వంగడాలతో ప్రయోజనం 
1
1/1

నూతన వంగడాలతో ప్రయోజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement