ప్రతిపాదనలిస్తే నిధులు విడుదల చేస్తా
యాచారం: ప్రజాప్రతినిధులుగా గెలుపొందడం అదృష్టంగా భావించాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గునుగల్ గ్రామ పంచాయతీతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గురువారం తొర్రూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులుగా గెలుపొందడం దేవుడిచ్చిన వరంగా భావించాలన్నారు. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని చెప్పారు. గ్రామాల్లో ఏఏ అభివృద్ధి పనులకు నిధులు కావాలో.. ప్రతిపాదనలు అందిస్తే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి అవకాశాన్ని ఇచ్చారని, గెలిచిన సర్పంచులు ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ అనిల్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీలు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, నాయకులు లక్ష్మణ్, రవీందర్, కన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


