కొడంగల్ రూపురేఖలు మారుస్తాం
రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థచైర్మన్ గురునాథ్‌రెడ్డి మున్సిపల్ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవం పాల్గొన్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి
కొడంగల్: పల్లైలెనా, పట్టణాల అభివృద్ధయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలో మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే అభివృద్ధికి చిరునామా అన్నారు. రూ.4.10 కోట్లతో మున్సిపల్ భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కమిషనర్ బలరాం నాయక్‌ను తన చాంబర్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత రావులపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్, నాయకులు మహమ్మద్ యూసుఫ్, నహీం, దాము పాల్గొన్నారు.
అదనపు గదులకు శంకుస్థాపన
దౌల్తాబాద్: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చల్లాపూర్ పాఠశాలలో రూ.60 లక్షలతో అదనపు తరగతి గదుల ఏర్పాటుకు, రూ.20 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, సర్పంచ్ రోజాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


