పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
అనంతగిరి: సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం జిల్లాస్థాయి అధికారులతో కలిసి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. అంతకుముందు వివిధ పాఠశాలల, వసతి గృహాల విద్యార్థులకు గాలిపటాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి వేడుకలను సంతోషదాయకంగా జరుపుకోవాలన్నారు. విద్యార్థులతో కలిసి గాలిపటాలు ఎగురువేశారు. బ్లాక్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఆర్గానిక్ ఫామ్‌లో తయారు చేసిన తేనెను కలెక్టర్ కొనుగోలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వయోజన క్రీడల శాఖ అధికారి సత్తార్, వివిధ వసతి గృహాల సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


