మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
పరిగి: మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. బలమైన అభ్యర్థులనే బరిలో ఉంచుదామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్, వెంకట్‌రాంరెడ్డి, తాహేర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి


