ఉత్తమ ఫలితాలకు కృషి చేయండి
అనంతగిరి: ఇంటర్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎన్ శంకర్ సూచించారు. శుక్రవారం వికారాబాద్ కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిలబస్ పూర్తయినందున ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. చురుకైన విద్యార్థులను గుర్తించి ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలన్నారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ నెల 20న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇంటర్ విద్యా వ్యవస్థ బలోపేతానికి రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు నర్సింహారెడ్డి, రూపాలక్ష్మి, కుమారస్వామి, బుచ్చిరెడ్డి, సురేశ్వరస్వామి, స్వర్ణలత, వెంకటేశ్వరరావు, నర్సింలు, రోజారాణి, వసంత, రమణకుమారి, సీనియర్ అసిస్టెంట్ వినోద్, జూనియర్ అసిస్టెంట్ సలీమాబేగం, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్


