అనుమానాస్పద స్థితిలో యువకుడి బలవన్మరణం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా ముందుకు సాగాలని డీసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన శనివారం పెద్ద గోల్కొండలోని ఓ ఫాంహౌస్‌లో ముఖ్యనేతల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న ఆరు మున్సిపాలిటీలు సహా వార్డులన్నీ కై వసం చేసుకోవాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆదరణ ఉన్న నేతను పోటీలో నిలబెట్టడంతో పాటు వారిని గెలిపించుకునే బాధ్యత శాసనసభ్యులదేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, ఎల్బీనగర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మధుయాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి భీమ్ భరత్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ పాల్గొన్నారు.
నేడు దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ
కందుకూరు: మండల పరిధిలోని ముచ్చర్లలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు కురుమ సంఘం మండల అధ్యక్షుడు అచ్చన పాండు కురుమ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గి మల్లేశం కురుమ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కురుమ, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమ తదితరులు హారజవుతున్నారన్నారు. సంఘం నాయకులు, కురుమలు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
షాద్‌నగర్‌రూరల్: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుశీల తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని యువకుడు(28) చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ సుశీల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలకుకోసం ప్రయత్నించగా ఆచూకీ తెలియరాలేదు. మృతుడి ఒంటిపై బనియన్, షర్టు లేకుండా నెక్కర్(షాట్) మాత్రమే ఉంది. మృతుడు స్థానిక పరిశ్రమలలో పనిచేసే ఇతర రాష్ట్రానికి చెందిన కార్మికుడిగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు ఉరేసుకున్నాడా..? ఎవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినా, ఆచూకీ లభించినా వెంటనే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో
గెలుపే లక్ష్యం
● డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
● జిల్లా ముఖ్యనేతలతో సమావేశం