పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ
కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన శేఖర్, వరంగల్ జిల్లాకు చెందిన జగదీశ్వర్‌చారి, హైదరాబాద్‌కు చెందిన స్పందన ఇటీవల మండల కేంద్రంలో తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ మేరకు అదే రోజు వారు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు , నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్) అప్లికేషన్ ఆధారంగా సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ గంగాధర్ బాధితులకు సెల్‌ఫోన్‌లను అందజేశారు. ఎవరైన సెల్‌ఫోన్లను పొగొట్టుకున్న, చోరికి గురైన ఫోన్ వివరాలను సీఈఐఆర్ ఫోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వార తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. సెల్‌ఫోన్ల రికవరీకి కృషి చేసిన కానిస్టేబుల్ రాంకోటిని సీఐ గంగాధర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్, కానిస్టేబుల్ రాంకోటి ఉన్నారు.


