ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ కుమార్ రాజ్‌బార్, అతని భార్య పూనమ్(24), కుమారుడు ఆర్యన్(4), కుమార్తె ఇషా(2)తో కలిసి బతుకుదెరువు నిమిత్తం జల్‌పల్లి శ్రీరామ కాలనీకి వలస వచ్చారు. దంపతులు లక్ష్మీగూడలోని మోడీ బిల్డర్స్ వద్ద లేబర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పనిచేసే వద్ద పరిచయమైన రింకూ కుమార్‌తో పూనమ్ రాత్రి పూట ఫోన్ మాట్లాడుతుండడాన్ని గమనించిన భర్త 20 రోజుల క్రితం మందలించాడు. ఈ నెల 1వ తేదీన ముఖేష్ పనికి వెళ్లి రాత్రి వచ్చి చూడగా పూనమ్, పిల్లలు కనిపించలేదు. స్వస్థలానికి వెళ్లి ఉంటుందని అక్కడ వాకబు చేసినా కనిపించలేదు. ఈ విషయమై రింకూ పైనే అనుమానం ఉందంటూ ముఖేష్ శుక్రవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ ఠాణాలోగాని 87126 62367 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
పిల్లలతో అదృశ్యమైన పూనమ్ (ఫైల్)
ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం
ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం


