రాస్నం అభివృద్ధి బాధ్యత నాదే
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ● కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ సురేఖ
యాలాల: తాండూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో రెండో సారి గెలుపొందిన రాస్నం పంచాయతీ సర్పంచ్ కావలి సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం నగరంలోని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ..రాస్నం అభివృద్ధికి అవ సరం మేర నిధులు కేటాయిస్తానన్నారు. గ్రామ అభివృద్ధి తన బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ సురేఖ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అండదండలతో ముందుకు సాగుతామన్నారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో అగ్గనూరు మాజీ సర్పంచ్ భీమప్ప, నాయకులు గాండ్ల వీరణ్ణ, బాబయ్య, మైనార్టీ నాయకులు అబ్దుల్ రషీద్, అజీం, యూసుఫ్, ఆజం, ఖుద్బుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జాగ్రత్త
అనంతగిరి: సంక్రాంతి పండుగకు సొంత ఊర్లు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచరాదు, తాళం వేసి పక్కింటి వాళ్లుకు చెప్పి వెళ్లాలన్నారు. దొంగతనాలు జరగకుండా పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు ఊరికి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు, నగదు, బంగారాన్ని బ్యాంక్ లాకర్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి
డీఈఓ రేణుకాదేవి
అనంతగిరి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సూచించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంగ్లిష్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీత మేరీ, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌కుమార్ గౌడ్, నాయకులు విజయ్ కుమార్, అరవింద్, ఆరాధన, బ్రహ్మచారి, రాజు, నర్సింలు,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి ఇంగ్లిష్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
దుద్యాల్: మండలంలోని చిలుముల్ మైల్వార్ పీఎం శ్రీ పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి ఇంగ్లిష్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం వికారాబాద్‌లోని బాలికల పాఠశాలలో పోటీలు జరిగాయి. 9వ తరగతి విద్యార్థులు మౌనిక, మనీష, 8వ తరగతి చదువుతున్న అశ్విని, 7వ తరగతి విద్యార్థి సోమ్‌నాథ్ జిల్లా స్థాయి పోటీల్లో సత్తాచాటారు. వీరిని పాఠశాల హెచ్‌ఎం యాదయ్య, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు సంగమేశ్వర్, ఉపాధ్యాయులు అభినందించారు.
రాస్నం అభివృద్ధి బాధ్యత నాదే
రాస్నం అభివృద్ధి బాధ్యత నాదే
రాస్నం అభివృద్ధి బాధ్యత నాదే


