‘లోకల్’ పర్యాటకం!
నూతన సంవత్సర వేడుకలను సరదాగా జరుపుకొనేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సందర్శనీయ స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టి రావాలని భావిస్తున్నారు. కొద్దిపాటి సమయం, తక్కువ ఖర్చుతో.. మనచెంతే ఆహ్లాదం పొందగలిగే జిల్లాలోని టూరిజం స్పాట్లపై ఓ లుక్కేద్దామా..
వికారాబాద్: జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో అనంతగిరి గుట్ట, ఫారెస్ట్ ఉంది. ఇక్కడ భారీ హనుమాన్ విగ్రహం, అనంతపద్మనాభ స్వామి ఆలయం, కోనేరుతో పాటు చుట్టు పక్కల రిసార్టులు ఉన్నాయి. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలతో చూపరులను కట్టిపడేస్తుంది. గుట్టపై చారిత్రక అనంత పద్మనాభస్వామి ఆలయం వెలిసింది. ఇక్కడ ట్రెక్కింగ్ స్పాట్లు, వందలాది రకాల పక్షులు మనసుకు హాయిగొల్పుగాయి. తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన కార్టేజీలు, పక్కనే బుగ్గ రామేశ్వరాలయం ఉన్నాయి. ధారూరు మండల పరిధిలోని కో ట్‌పల్లి ప్రాజెక్టులో, అనంతగిరి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
వికారాబాద్ అనంతగిరి కొండలు
మనచెంతే ఆహ్లాదం
టూరిజం అభివృద్ధి దిశగా అడుగులు
రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకులు
ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఆరుట్లలో ‘దక్షిణ కాశీ’
మంచాల: రాచకొండ రాజుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడం శ్రీబుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం. రేచర్ల పద్మనాయక వంశస్తులైన సింగ భూపాలుడి కాలంలో, మంచాల మండలం ఆరుట్ల గ్రామ పరిధిలో దీన్ని నిర్మించారు. రాచకొండ గుట్టలను అనుసరించి ఊరికి దూరంగా పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం ఉంది. ఇక్కడ తూర్పునుంచి పడమర వైపు నీరు ప్రవహిస్తూ దక్షిణం వైపు వెళ్లిపుతుంది. దీంతో ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు.
పోలేపల్లిలో.. ఎల్లమ్మతల్లి
కొడంగల్: దుద్యాల మండలం పోలెపల్లిలో స్వయంభువుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం పర్యాటకులు, భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.పచ్చని పంట పొలాల మధ్య వెలిసిన అమ్మవారి కనువిందు చేస్తుంది. ఇక్కడ నిర్వహించే పెద్దజాతర ఈప్రాంతంలోనే అతిపెద్ద వేడుక. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు. యాటలు.. కోళ్లతో మొక్కులు సమర్పించుకుని, విందు చేసుకుంటారు. ఇక్కడ నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవం సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు.
‘లోకల్’ పర్యాటకం!
‘లోకల్’ పర్యాటకం!
‘లోకల్’ పర్యాటకం!


