బైక్ ఢీ, ఒకరి మృతి
పరిగి: బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చేకూరి సుభానయ్య(42) ఆటో నడుపుకొంటూ జీవనం కొనసాగించేవాడు. రోజులాగే పత్తిలోడుతో గ్రామం నుంచి మార్కెట్ వచ్చాడు. అన్‌లోడ్ అనంతరం.. ఆటోను స్టాండ్ వద్ద పార్కింగ్ చేసి, కిరాయి తీసుకునేందుకు రోడ్డు దాడుతుండగా.. బస్టాండ్ నుంచి హైదారాబాద్ వైపు వెళ్తున్న టీఎస్34కె 2552 నంబరు గల బైక్ అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడంతో.. క్షతగాత్రున్ని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నగరానికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య మంజుల, కుమారుడు, కూతురు ఉంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


