నిబంధనలు పాటించాలి
అనంతగిరి: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను కచ్చితంగా పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వికారాబాద్, తాండూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య పరిరక్షణకు ప్రైవేట్ వైద్యులు సహకరించాలన్నారు. ప్రతి హాస్పిటల్‌లో వైద్యుల వివరాలు, అందించే సేవలు, చారీలు వివరాలు రోగులకు కనిపించేలా ప్రదర్శించాలన్నారు. సమావేశంలో వైద్యులు సాధు సత్యానంద్, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్, ప్రదీప్ గౌడ్, అనిల్ కుమార్, ఎం జయప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


