ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Dec 28 2025 12:49 PM | Updated on Dec 28 2025 12:49 PM

ఆదివా

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 వికారాబాద్‌: జిల్లాలో 2024తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. క్రైమ్‌ రేట్‌ ఆందోళన కలిగిస్తోంది. నిఘా వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆత్మహత్యలు, హాట్‌స్పాట్ల గుర్తింపు, సత్వరం స్పందించడం వంటి వాటి కారణంగా రోడ్డు ప్రమాదాలు కొంత మేర తగ్గాయి. మృతుల సంఖ్య కాస్త తగ్గింది. కొన్ని చోట్ల సివిల్‌ తగాదాల్లో పోలీసులు తలదూర్చుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. చన్గొముల్‌, వికారాబాద్‌, నవాబుపేట, మోమిన్‌పేట, తాండూరు, ధారూరు, పరిగి, మర్పల్లి తదితర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సివిల్‌ డిస్పూట్స్‌లో పోలీసుల జోక్యం పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మిస్సింగ్‌, కిడ్నాప్‌ కేసులు పెరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. గుట్కా, గంజాయి లభ్యత, విక్రయాలు, రేషన్‌ బియ్యం, కలప, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. సీసీ టీవీల ఏర్పాటులో పురోగతి సాధించారు. ఈ ఏడాది ప్రధాన నేరాలు పెరిగాయి. ఆస్తి కోసం హత్యలు, రాబరీలు, దొంగతనాలు ఎక్కువయ్యాయి. హత్యలు, నేరపూరిత హత్యలు సైతం పెరిగినట్టు పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. చీటింగ్‌, హత్యాయత్నం కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. కిడ్నాప్‌, అత్యాచార ఘటనలు కొంచం తగ్గాయి. ఇటీవలి కాలంలో చాలా ఫిర్యాదులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండానే బుట్టదాఖలవుతున్నాయి. పోలీస్‌ స్టేషన్లలో నేతల ప్రభావం పెరిగి పోవడంతో వారి ఒత్తిళ్లకు తలొగ్గి ఫిర్యాదులను పక్కన పడేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో అమ్యామ్యాలకు తలొగ్గుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ వివాదాల్లో ఏదో ఒక వర్గానికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు. తాండూరు సబ్‌ డివిజన్‌ పోలీసులు ఇసుక మాఫియాతో జతకట్టారనే విమర్శలు వచ్చాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఒకే సారి ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడిన విషయం తెలిసిందే. అయినా అదే తీరు కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ● ఈ ఏడాది జిల్లా కోర్టు నేరస్తుల విషయంలో సంచలన తీర్పులు ఇచ్చింది. వికారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య, కూతురిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష విధించింది. ● నావాబుపేట మండలం నారెగూడ హత్యాయత్నం కేసులో కోర్టు నిందితులకు డబుల్‌ లైఫ్‌ శిక్ష, ఒక్కొక్కరికి రూ.30 వేల జరిమానా విధించింది. ● ధారూరు మండలం మైలారం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష, జరిమానా విధించింది. ధారూరులో ఓ వ్యక్తిని హత్య చేయడంతో పాటు మరో మహిళను తీవ్రంగా గాయపర్చిన కేసులో నిందితులకు లైఫ్‌ శిక్ష విధించారు. ● తాండూరు మండలం మాల్కాపూర్‌లో భార్య భర్తను హత్య చేయగా ఆమెకు తండ్రి సహకరించాడు. బంట్వారం మండలం కొంపల్లికి చెందిన భార్యభర్తలు మోమిన్‌పేట మండలం కేసారం సమీపంలోని ఓ వెంచర్‌లో గొడవ పడగా భార్య.. భర్తను రాయితో మోది హతమార్చింది. కోట్‌పల్లి మండలం రాంపూర్‌లో పడుకున్న భర్త తలపై బండరాయితో మోది హతమార్చింది. ● వికారాబాద్‌ మండలం పెండ్లిమడుగు గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని కులాంతర వివాహం చేసుకుని హైదరాబాద్‌లో చంపాడు. అతి కిరాతంగా ముక్కలు చేసి మూసిలో పడేసిన ఘటన సంచలనం రేపింది. ● చేవెళ్ల మండలం ఖానాపూర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు టిప్పర్‌ ఢీ కొట్టిన ఘటనలో 19 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద విషాధం.

న్యూస్‌రీల్‌

జిల్లాలో 2024 – 2025 సంవత్సరాల్లో నమోదైన కేసులు ఇలా..

ఘటనలు 2024లో 2025లో

ఆస్తి కోసం హత్యలు 01 04

డైకె టీ 00 02

రాబరీ 02 03

పగటిపూట దొంగతనాలు 13 20

రాత్రి దొంగతనాలు 87 68

సాధారణ దొంగతనాలు 163 137

హత్యలు 22 25

నేరపూరిత హత్యలు 06 13

అల్లర్లు 01 02

కిడ్నాప్‌లు 67 65

లైంగిక దాడులు 64 63

తీవ్రంగా గాయపర్చడం 41 36

స్వల్పంగా గాయపర్చడం 439 436

మోసాలు(చీటింగ్‌) 244 279

మోసపూరిత హత్యలు 1 2

నకిలీ కరెన్సీ 01 00

హత్యాయత్నం 32 42

ప్రమాద మృతులు 154 144

సాధారణ రోడ్డు ప్రమాదాలు 145 136

చిన్నపాటి ప్రమాదాలు 27 21

ఇతర నేరాలు 2,181 2,315

మొత్తం కేసులు 3,691 3,813

జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది హత్యలు పెరిగాయి. 25 హత్యలు జరిగ్గా 24 కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నాలుగు ఆస్తి కోసం హత్యలు, 13 కుట్రపూరిత హత్యలు కూడా జరిగాయి.

పురోగతి సాధించాం

గతంతో పోలిస్తే జిల్లాలో సైబర్‌, ఇతర నేరాలు పెరిగాయి. కేసుల నమోదులో పారదర్శకంగా వ్యవ హరించాం. కొన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్ట డం ఊరటనిస్తోంది. నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగాం. బాలకార్మికులకు విముక్తి కల్పించాం.

– స్నేహమెహ్ర, ఎస్పీ

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 3.31శాతం ఎక్కువ

దొంగతనాలు, రాబరీలు, హత్యలు, హత్యాయత్నం వంటి కేసులు అధికం

సివిల్‌ తగాదాల్లో పోలీసుల ప్రమేయం

ఇసుక అక్రమ రవాణాలోనూ ఆరోపణలు

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

నేరాలు పెరిగాయ్‌

ప్రధాన నేరాలు

ఫిర్యాదులు బుట్టదాఖలు

ఇసుక మాఫియాతో..

సంచలన తీర్పులు

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20251
1/4

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20252
2/4

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20253
3/4

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20254
4/4

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement