తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలకు డిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బొంగ్లూర్ గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల్లో, ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. తాటి చెట్లను నరకివేయడంతో తాము జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 25 చెట్లకు యజమాని జనార్ధన్‌రెడ్డి గీత కార్మికులకు సమాచారం లేకుండా తొలగించారన్నారు. ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదానందంగౌడ్, మల్లేశ్‌గౌడ్, చంద్రయ్యగౌడ్, శేఖర్‌గౌడ్, మూల నర్సింహ, సత్తయ్య, యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు.


