డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇప్పిస్తామంటూ..
కొందుర్గు: అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఘటన కొందుర్గులో ఆలస్యంగా వెలుగులోచి వచ్చింది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన సిమెంట్ డీలర్ గండేటి వేణుగోపాల్ తన ఫేస్‌బుక్‌లో నవంబర్ 25న అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు ప్రకటన చూసి లింక్ ఓపెన్ చేశాడు. నవంబర్ 28న 95026 73232 నంబర్ నుంచి వంశీ అనే అపరిచిత వ్యక్తి ఇంటికి వచ్చి అగ్రిమెంట్ ఫారం నింపుకొని వెళ్లాడు.
బాధితుడు వేణుగోపాల్..
వంశీ సూచనలు పాటిస్తూ పలు దఫాలుగా నాటి నుంచి ఈ నెల 25 వరకు ఆన్‌లైన్ లింక్ ద్వారా, ఫోన్ పే ద్వారా మొత్తంగా రూ.3,19,184 చెల్లించాడు. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో శనివారం బాధితుడు షాద్‌నగర్‌లోని అమెజాన్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. తమ వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇచ్చే పద్దతి ఉండదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించి వేణుగోపాల్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
రూ.3.19 లక్షలకు టోకరా


