గజగజా వణికిస్తున్న చలి
● తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
● ఇబ్బంది పడుతున్న జనం
దౌల్తాబాద్: చలిపులి గజగజా వణికిస్తోంది. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలితో పాటు, దట్టమైన పొగమంచు, బలంగా శీతల గాలి వీస్తుండటంతో బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అవస్థపడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళలో చాలామందిచలిమంట కాగుతున్నారు. విధుల నిమిత్తం కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు నిండుగా ఉలన్ దుస్తులు ధరించి ప్రయాణం కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో పాము కలకలం
కొట్టి చంపిన సిబ్బంది
తాండూరు రూరల్: ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. రెండురోజుల సెలవు అనంతరం శనివారం ఉదయం కార్యాలయంను తెరచిన సిబ్బందికి బాత్రూంలో కట్లపాము కనిపించింది. దీంతో భయాందోళన వారు.. కర్రతో సర్పాన్ని కొట్టి చంపారు. ఈ మధ్య కాలంలో వరుసగా పాములు ఆఫీసులోకి వస్తున్నాయని, దీనికి కారణం చుట్టుపక్కల అపరిశుభ్రత, పిచ్చిమొక్కలేనని తెలిపారు. కొన్ని నెలలుగా నాలుగైదు సర్పాలను చంపేశామని సిబ్బంది పేర్కొన్నారు. కార్యాలయం ఎదుట ఉన్న పార్కులో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బషీరాబాద్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధి రెడ్డిఘణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అల్తాఫ్.. తన రెండు ట్రాక్టర్ల ద్వారా శనివారం తెల్లవారు జామున ఇసుక రవాణా చేస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అలాగే అగ్గనూరు గ్రామానికి చెందిన మరో ట్రాక్టర్.. గోనూరు వాగునుంచి నవల్గాకు ఇసుక తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేసినట్లు ఎస్‌ఐ విఠల్ తెలిపారు. డ్రైవర్లు అశ్వాక్ అలీ, కుర్వ కిరణ్ కుమార్, పిట్టలి సుమంత్ కుమార్లపై కేసునమోదు చేసినట్లు వెల్లడించారు.
గంజాయి సేవిస్తున్న
నలుగురికి రిమాండ్
400 గ్రాముల గంజాయి స్వాధీనం
కందుకూరు: గంజాయి మత్తులో తూగుతున్న నలుగురు బీహారీలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కందుకూరు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. కందుకూరు చౌరస్తా హీరోహోండా షోరూం పక్కన ఉన్న గదిలో గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దీంతో ఆగదిలో 400 గ్రాముల గంజాయి లభ్యమైంది. బీహార్ రాష్ట్రం భగల్‌పూర్ జిల్లా పిర్‌పింటికి చెందిన మహ్మద్ చోటు(20), షేక్ రాజు(46), మహ్మద్ ఆలమ్(36), మహ్మద్ రేహాన్(20) గంజాయి మత్తులో ఉన్నారు. వీరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీరంతా స్థానికంగా మేస్త్రీలు, కూలీలుగా పని చేస్తున్నారు. ఎస్‌ఐ పరమేశ్ కేసు దర్యాప్తు చేపట్టారు.
సర్పంచ్‌లు బాధ్యతగా పనిచేయాలి
రాష్ట్ర మంత్రి సీతక్క
ఆమనగల్లు: సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం తలకొండపల్లి మండలం వీరన్నపల్లి సర్పంచ్ కడారి రామకృష్ణ యాదవ్ శనివారం నగరంలోని ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ని ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్‌ను అభినందించిన సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకా లకు అర్హులకు అందే లా చూడాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉప సర్పంచ్ రాఘవేందర్, మాజీ సర్పంచ్ లింగం గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, వినయ్, అనిల్ తదితరులున్నారు.
గజగజా వణికిస్తున్న చలి
గజగజా వణికిస్తున్న చలి


