‘పరిషత్’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
బషీరాబాద్: రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి వివిధ గ్రామాల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను నగరంలో కలిశారు. ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీచేసిన వారికి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారో తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగాయని, తాను అంతటా ప్రచారం చేయలేదని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, పార్టీ బలపర్చిన వారిని గెలిపించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే.. పరిషత్ ఎన్నికల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విభేదాలు వీడి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, భోజ్యా నాయక్ సర్పంచ్ శాంతిబాయి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రామునాయక్, భీమప్ప, విష్ణు, ప్రతాప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సింహులు, బాలకృష్ణ, హనుమంతు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి


