ప్రజల పక్షాన పోరాడితే గుర్తింపు
రాజ్యసభ్యుడు ఆర్.కృష్ణయ్య
కడ్తాల్: పంచాయతీ ఎన్నికల్లో యువజన సంఘాల ఐక్యవేదిక నుంచి తనతో పాటు వసంత, పూలమ్మ వార్డు సభ్యులుగా విజయం సాధించారని యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ అన్నారు. శనివారం ఆయన రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. పోరాటం చేసే వారిని ప్రజలు గుర్తిస్తారని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజల అభిమానాన్ని మరింత చూరగొనాలని, భవిష్యత్‌లో గొప్ప నాయకుడిగా ఎదగాలని ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవేందర్‌ను, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభినందించి సన్మానించారు.
ఖాళీల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం


