డబ్బులు పంపుతావా.. జైలుకు వెళ్తావా?
● బెదిరింపు కాల్స్‌తో యువకుడి ఆత్మహత్య
● పోలీసుల అదుపులో నిందితుడు
పూడూరు: ‘డబ్బులు పంపు. లేదంటే జైలుకు పంపిస్తాను. చంపేస్తా’ అని గుర్తు తెలియని వ్యక్తి బెధిరింపు ఫోన్‌కాల్స్‌తో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రాకంచర్ల గ్రామానికి చెందిన వడ్త్యా రాఘవన్ అలియాస్ పవన్(26) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా రెండు సెల్‌ఫోన్ నంబర్లతో.. ఓ వ్యక్తి క్రైమ్ కానిస్టేబుల్ అని, కంట్రోల్ రూం నుంచి మాట్లాడుతున్నానని వివిధ రకాలుగా బెధిరించి డబ్బులు వేయమని వేధించసాగాడు. డబ్బులు పంపకుంటే జైలుకు పంపిస్తానని, చంపేస్తానని బెధిరించాడు. దీంతో మనస్తాపంచెందిన పవన్.. ఈ నెల 23న రాకంచర్ల ఇండస్ట్రీయల్ పార్కు ప్రాంతంలో పురుగు మందు తాగి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కాల్‌డేటా ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిపై అనుమానం ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిని డబ్బుల కోసం ఫోన్లో వేధించినట్లు గుర్తించారు. మృతుడి అన్న విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


