సామగ్రి ధ్వంసం కాలేదు | - | Sakshi
Sakshi News home page

సామగ్రి ధ్వంసం కాలేదు

Dec 25 2025 10:22 AM | Updated on Dec 25 2025 10:22 AM

సామగ్

సామగ్రి ధ్వంసం కాలేదు

తాండూరు రూరల్‌: మండల పరిధి గౌతపూర్‌ పంచాయతీ కార్యాలయంలో ఎలాంటి సామగ్రి ధ్వంసం కాలేదని పంచాయతీ కార్యదర్శి ఫక్రోజి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ సర్పంచ్‌ రాజప్పగౌడ్‌ ఆరోపణలు అవాస్తమన్నారు. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గదులను శుభ్రం చేస్తున్న క్రమంలో ఉత్తమ అవార్డు జ్ఞాపిక, నేమ్‌బోర్డు, పాలకవర్గం శిలాఫలకం ఒక గదిలో భద్రపరిచామని పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో వాటన్నింటిని కార్యాలయంలో ప్రదర్శనకు పెడతామన్నారు.

ఓడిపోయామని..

దాడికి పాల్పడి

హత్యాయత్నం కేసులో

ఆరుగురి రిమాండ్‌

వివరాలు వెల్లడించిన సీఐ రఘురాములు

బంట్వారం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయామన్న కక్షతో ప్రత్యర్థిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ధారూరు సీఐ రఘురాములు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పాతకక్షల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఓడిపోయామన్న కోపంతో కోట్‌పల్లి సర్పంచ్‌ జంగం బసమ్మ భర్త సంగయ్యస్వామిపై ప్రత్యర్థులు దాడికి పథకం వేశారు. ఈ నెల 18న రాత్రి 10.40 గంటలకు స్వామి ఇంటి సమీపంలోనే హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోట్‌పల్లికి చెందిన మహ్మద్‌ షకీర్‌, ఆనెం శివకుమార్‌, మహ్మద్‌ అక్రమ్‌, ఖురేషి అజ్మత్‌, మహ్మద్‌ షాన్వాస్‌, నక్కల బందెయ్యలను అనుమానితులుగా భావించి, అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరం అంగీకరించారు. ఈ కేసులో లోతుగా విచారణ చేపడతామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని సీఐ తెలిపారు.

రాజ్‌పాకాల కేసు

వీడియోలు వైరల్‌

శంకర్‌పల్లి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలపై మోకిల పీఎస్‌లో నమోదైన కేసు,చార్జిషీట్‌ అంశాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది అక్టోబర్‌ 26న రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని, ఇందులో విదేశీ మద్యం వినియోగించారనే అభియోగాలపై కేసు నమోదైంది. దీనిపై జూన్‌ 30నచార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈఅంశాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో 35 మందిని విచారించిన తర్వాత, అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విదేశీ మద్యంతో పార్టీ చేసిన రాజ్‌ పాకాలపై, డగ్ర్‌ పరీక్షలో పాజిటివ్‌గా తెలిసిన విజయ్‌ మద్దూరిపై గతంలోనే చార్జిషీట్‌ దాఖలు చేశామని మోకిల సీప వీరబాబు తెలిపారు.

స్వార్థ ప్రయోజనాలకు

యూనియన్‌ పేరు వాడొద్దు

షాద్‌నగర్‌రూరల్‌: తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) సంఘం పేరును తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే సహించేది లేదని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్‌, మైల సైదులు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని టీడబ్ల్యూజేఎఫ్‌ కార్యాలయంలో సంఘం డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్‌గౌడ్‌, నరేష్‌ అధ్యక్షతన సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వ్యక్తిగత అవసరాల కోసం టీడబ్ల్యూజేఎఫ్‌ సంఘం పేరును తప్పుగా వాడుకుంటున్నాని, ఇది సరైన పద్దతి కాదని హితవు పలికారు.

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని..

మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌: కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికిలోనైన ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.. వివరాలిలా ఉన్నాయి.. కొంపల్లికి చెందిన కృష్ణ, నాగమణి(42) దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపానికి లోనైన నాగమణి బుధవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా ఫాక్స్‌సాగర్‌ సమీపంలో చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ కి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

సామగ్రి ధ్వంసం కాలేదు 1
1/2

సామగ్రి ధ్వంసం కాలేదు

సామగ్రి ధ్వంసం కాలేదు 2
2/2

సామగ్రి ధ్వంసం కాలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement