టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్
కొడంగల్ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ కోరారు. బుధవారం నగరంలోని కాచిగూడలో నిర్వహించిన స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010 కంటే ముందుగా నియామకం అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2025– 26 విద్యా సంవత్సరం పది పరీక్షల షెడ్యూల్‌ను యథావిధిగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ జీపీఎఫ్ నిధులు, టీఎస్‌జీ ఎల్‌ఐసీ నిధులు, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలన్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు బేసిక్ పే కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని కోరారు.


