ఓటరు జాబితాను సరిచేయండి
● డబుల్ ఓట్లను తొలగించాలి ● సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు రూరల్: ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఉండరాదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూ చించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాను 2025 జాబి తాతో అనుసంధానం చేయాలన్నారు. 2002 లో ఉన్న ఓటర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నారా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించా లని ఆదేశించారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాండూ రు నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాలు, 2 లక్షల 20 వేల మండి ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్లు తమ నివాస పత్రాలతో పాటు సరైన ఆధారాలు చూపించాలన్నారు. ఒక వ్యక్తి కి రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒకదాన్ని తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లలిత, బీఎల్‌ఓలు పాల్గొన్నారు..


