ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం
పరిగి: ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బృందావన్ గార్డెన్‌లో ప్రభుత్వం తరఫున క్రిస్‌మస్ విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని తెలిపారు. కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల పండుగలను అధికారికంగా.. ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
క్రిస్టియన్లకు ప్రభుత్వం అండ
తాండూరు: పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం అండ గా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్‌లో తాండూ రు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత్ అనురాగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది క్రిస్టియన్లు హాజర య్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం క్రిస్టియన్లుతో కలిసి ఎమ్మెల్యే విందు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


