కోడ్ ముగిసినా.. ముసుగు తీయరా!
తాండూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసి వారం రోజులు గడిచినా.. నేతల విగ్రహాల ముసుగు తొలగలేదు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యాదగిరి.. మున్సిపల్ పరిఽధిలోని జాతీయ, రాజకీయ నేతల విగ్రహాలకు తెల్లని దుస్తులను చుట్టేశారు. అయితే ఎన్నికలు ముగిసి, పాలకవర్గం కొలువుదీరినా.. నేటి వరకు ముసుగులు తొలగలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొని, వాటి ముసుగులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం
కోడ్ ముగిసినా.. ముసుగు తీయరా!


