రద్దీ బస్సుల్లో దుండగుల చేతివాటం
ధారూరు: బస్సుల్లోని రద్దీని దుండగులు ఆసరాగా చేసుకుంటున్నారు. కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సుల్లో ఎక్కి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు, నగలు, సెల్‌ఫోన్లు, బ్యాగులు ఇలా ఏది దొరికితే అది తస్కరిస్తున్నారు. టీజీ 34 జెడ్ 0022 నంబరు గల ఆర్టీసీ బస్సు మంగళవారం 114 మంది ప్రయాణికులతో నగరానికి బయలుదేరింది. ధారూరు సమీపంలోకి రాగానే ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్ పోయిందని గోల చేశాడు. దీంతో బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆపారు. దొంగిలించిన వారు ఫోన్ ఇవ్వాలని కోరినా ఎదరూ ముందుకు రాలేదు. పోలీసులు వచ్చినా ఫలితం లేకపోవడంతో, ఫిర్యాదు చేయాలని సూచించారు.


