మహిళల భద్రతకు ప్రాధాన్యత
అనంతగిరి: జిల్లాలో మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నూతన బోరు పనులను ప్రారంభించారు. పెండింగ్ ఫైల్స్, రికార్డులు, బ్యారక్స్, రైటర్ రూంను పరిశీలించి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల వివరా ల ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వ ర న్యాయం జరిగేలా చూడాలన్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అత్యంత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి విడుదలైన నిధులను సద్వినియోగం చేసుకొని పోలీస్ స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ బీ సరోజ, ఎస్‌ఐలు అనిత, స్రవంతి, శ్వేత, రాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


