సొంత డబ్బులతో పెన్షన్
కేశంపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం రోజునే అమలు చేశారు సంగెం సర్పంచ్ వేణుగోపాలచారి. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరయ్యే వరకూ తన సొంత డబ్బులు అందజేస్తానని ప్రచారంలో పలువురురికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం లక్ష్మమ్మ, నర్సింలుకు డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షఖిల్, యెన్నం గోపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సలీం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


