కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా.. | - | Sakshi
Sakshi News home page

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

Dec 23 2025 8:19 AM | Updated on Dec 23 2025 8:19 AM

కిచెన

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

ధారూరు: మండలంలోని పలు పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడంతో సోమవారం నూతన సర్పంచ్‌లు కిచెన్‌షెడ్‌, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. మరి కొన్ని చోట్ల టెంట్ల కింద బాధ్యతలు తీసుకున్నారు. లక్ష్మీనగర్‌తండా సర్పంచ్‌ పూజ, నర్సాపూర్‌ సర్పంచ్‌ బీర్ల రాజు అంగన్‌వాడీ కేంద్రాల్లో బాధ్యతలు తీసుకున్నారు. కుమ్మర్‌పల్లి సర్పంచ్‌ వర్‌ాత్య దివ్వ కిచెన్‌షెడ్‌ ఎదుట, ధర్మాపూర్‌, పీసీఎం తండాల సర్పంచులు ఇళ్ల ముందు, అల్లాపూర్‌, నాగ్‌సాన్‌పల్లి, మోమిన్‌ఖుర్దు, రాజాపూర్‌, కొండాపూర్‌ఖుర్దు సర్పంచ్‌లు పాఠశాలల్లో, అంపల్లి సర్పంచ్‌ ఓ ఇంటి వద్ద గల షట్టర్‌ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అల్లిపూర్‌లో గొట్టిముకుల వీరేశం(65) ఎక్కువ వయస్సున్న సర్పంచుగా, మహిళల్లో నాగారం సర్పంచ్‌ నీరటి లక్ష్మి(29) తక్కువ వయస్సున్న సర్పంచ్‌గా నిలిచారు.

రేకుల షెడ్డులో..

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం గిర్మాపూర్‌లో సోమవారం సర్పంచ్‌ శివరాం నాయక్‌, ఉప సర్పంచ్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి మరో ఆరుగురు వార్డు సభ్యులు రేకుల షెడ్డులో ప్రమాణ స్వీకారం చేశారు. గిర్మాపూర్‌ను 2018లో పంచాయతీగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సొంత భవనానికి నోచుకోలేదు. గ్రామ మొదటి సర్పంచ్‌ శివరాం నాయక్‌తో తహసీల్దార్‌ వెంకట్‌ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని పాలకవర్గం కోరింది.

21 ఏళ్లకే సర్పంచ్‌

కొడంగల్‌ రూరల్‌: మండల పరిధిలోని చిట్లపల్లి సర్పంచుగా తలారి జ్యోతి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న జ్యోతి ఈసారి సర్పంచ్‌ బరిలో నిలిచి, తన ఓటు తనకే వేసుకున్నారు. 21 సంవత్సరాలకే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదిలా ఉండగా ఉప సర్పంచుగా సంగెం చంద్రకళ, వార్డు మెంబర్లుగా సాయిరెడ్డి, హబీబ్‌, శాంతమ్మ, బొర్ర వెంకటప్ప, బొర్ర కిష్టప్ప, మంజుళ, అమృతమ్మ, కుమ్మరి శ్రీనివాస్‌(కరాటే), పద్మమ్మ లు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సర్పంచు జ్యోతిని గ్రామస్తులు అభినందించారు.

పాఠశాలలో..

మర్పల్లి: మండలంలోని గుర్రంగట్టు, శాపూర్‌, కుడుగుంట, నర్సాపూర్‌ పెద్ద తండా, జంశాద్‌పూర్‌, రామపూర్‌ గ్రామాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేవు. సోమవారం నూతన పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకున్నారు. మల్లికార్జున గిరి గ్రామంలో స్థానికులు చందాలు వేసుకొని నిర్మించిన భవనం వద్ద సర్పంచ్‌ భాగ్యమ్మ, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రామాపూర్‌ సర్పంచ్‌ రమాదేవి, వార్డు సభ్యులు అంగన్‌వాడీ కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు.

ధారూరు: కొండాపూర్‌ఖర్దులో పాఠశాల భవనంలో..

ధారూరు: కుమ్మర్‌పల్లిలో కిచెన్‌షెడ్‌ వద్ద ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలి

ఇవే సర్పంచులప్రమాణ స్వీకార కేంద్రాలు

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా.. 1
1/6

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా.. 2
2/6

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా.. 3
3/6

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా.. 4
4/6

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా.. 5
5/6

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా.. 6
6/6

కిచెన్‌షెడ్‌, అంగన్‌వాడీ.. వగైరా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement