టిప్పర్‌ డ్రైౖవర్‌పై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ డ్రైౖవర్‌పై కేసు నమోదు

Dec 23 2025 8:19 AM | Updated on Dec 23 2025 8:19 AM

టిప్పర్‌ డ్రైౖవర్‌పై కేసు నమోదు

టిప్పర్‌ డ్రైౖవర్‌పై కేసు నమోదు

బొంరాస్‌పేట: పనిచేస్తున్న కర్మాగారంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందగా.. ఈ ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి చౌదర్‌పల్లి శివారు శ్రీసాయిలక్ష్మీ మెటల్‌ ఇండస్ట్రీస్‌లో గ్రామానికి చెందిన ఖాసీం పాషా(29) పదిహేనేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. లోడర్‌తో కంకర నింపుతున్న క్రమంలో టిప్పర్‌కింద కిందపడి పాష మృతి చెందాడు. మృతుడి భార్య గౌసియాబేగం ఫిర్యాదు మేరకు టిప్పర్‌ డ్రైవర్‌ అశోక్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బాలవెంకట రమణ తెలిపారు.

ప్రాణం ఖరీదు రూ.20 లక్షలు!

కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతు డి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్‌ చేయగా.. రూ.20 లక్షలు పరిహారం ఇచ్చేందు కు యాజమాన్యం ఒప్పుకున్నట్లు సమాచారం.

కారు ఢీకొని చిన్నారి మృతి

పూడూరు: ప్రమాదవశాత్తు కారుఢీ కొని చి న్నారి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. చన్గోముల్‌ ఎస్‌ఐ భరత్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాకంచర్ల గ్రామంలో ఇంటి ముందు అడుకుంటున్న చిన్నారి సౌజన్య(7)ను అటుగా వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. బాలికను పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.

బస్టాప్‌లో ప్రమాదం

వృద్ధురాలికి గాయాలు

మొయినాబాద్‌: ఆర్టీసీ బస్సు చక్రం వృద్ధురాలి కాలుపై నుంచి వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్‌ పరిధిలోని చిలుకూరుకు చెందిన వృద్ధురాలు కుమ్మరి భారతమ్మ(70) సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మొయినాబాద్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్‌ బస్టాప్‌లో ని ల్చుంది. చేవెళ్ల–హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు వృద్ధురాలు కాలుపైనుంచి వెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్సకోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. బస్సును ఠాణాకు తరలించి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

యాచారం: బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బదిమీది రాజు(40) సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుంచి బైక్‌పై అత్తారిల్లు అయిన చింతపట్లకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఓ వెంచర్‌ డివైడర్‌కు బైక్‌ను ఢీకొట్టి కిందపడి పోయాడు. తీవ్ర గాయాలైన ఆయన్ని గ్రామస్తులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, నలుగురు పిల్లలు ఉన్నారు.

వ్యక్తి అదృశ్యం

మొయినాబాద్‌: తండ్రితో పాటు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి బస్సు దిగి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన జీనగుర్తి నవీన్‌గౌడ్‌ భార్యాపిల్లలు, తండ్రితో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నారు. కాగా ఈ నెల 19న ఉదయం 11 గంటలకు తాండూరుకు వెళ్లేందుకు తండ్రి దస్తయ్య, కొడుకు నవీన్‌గౌడ్‌ బస్సులో బయలుదేరారు. బస్సు మొయినాబాద్‌ బస్టాప్‌ వద్దకు చేరుకోగానే నవీన్‌గౌడ్‌ భార్యవద్దకు వెళ్తానని చెప్పి బస్సు దిగాడు. కానీ అక్కడి వెళ్లకుండా అదృశ్యమయ్యాడు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

స్ఫూర్తిప్రదాత శ్రీనివాసరామానుజన్‌

మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లోని శ్రీ విద్యానికేతన్‌ హై స్కూల్‌లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య అతిథిగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ అధ్యక్షులు ఎస్‌.వెంకటేష్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందిస్తాయన్నారు. పాఠశాలలో స్వయంగా విద్యార్థులు నిర్వహించిన గణిత క్విజ్‌లు, గణిత నమునాల ప్రదర్శన, సమస్య పరిష్కార కార్యక్రమాలు, సంఖ్యలతో వినోదాత్మక కార్యకలాపాలు విద్యార్థులను రోబో ఆన్సర్‌ చేసే విధానం పాఠశాలలో అందరినులను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ గణిత ప్రతిభను ప్రదర్శించగా ప్రత్యేకంగా తయారు చేసిన గణిత నమూనాలు అందరి ప్రశంసలను పొందాయి. యాజమాన్యం బోయ లక్ష్మణ్‌, నాగలక్ష్మి, రాజేంద్రనగర్‌ మండల ప్రైవేటు పాఠశాలల అధ్యక్షులు ఎం.ప్రభాకరాచారి, ప్రధాన కార్యదర్శి జి.శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement