ఇక ఔటర్‌కు అన్ని వైపులా రోడ్లు తళతళ | - | Sakshi
Sakshi News home page

ఇక ఔటర్‌కు అన్ని వైపులా రోడ్లు తళతళ

Dec 23 2025 8:19 AM | Updated on Dec 23 2025 8:19 AM

ఇక ఔటర్‌కు అన్ని వైపులా రోడ్లు తళతళ

ఇక ఔటర్‌కు అన్ని వైపులా రోడ్లు తళతళ

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు బంజారాహిల్స్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ మీదుగా శిల్పా లేఅవుట్‌ వరకు అక్కడి నుంచి నేరుగా ఔటర్‌కు చేరుకొనే విధంగా కొత్త ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్‌)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్‌ఎండీఏ తాజాగా టెండర్లను ఆహ్వానించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ రూట్‌లో డైరీఫామ్‌ వరకు ఎలివేటెడ్‌ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు మరో 23 కి.మీ.ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి.ఓ బడా నిర్మాణ సంస్థ ఈ టెండర్‌లను దక్కించుకుంది. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12 నుంచి ఫిలింనగర్‌, జడ్జీస్‌ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్‌, శిల్పా లేఅవుట్‌ మీదుగా ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రతిపాదించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్‌ సమీపం వరకు వచ్చే ప్లైఓవర్‌ వరకు ఈ సరికొత్త రహదారికి ప్రణాళికలు రూపొందించారు. ఔటర్‌ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరుకొనేందుకు, బంజారాహిల్స్‌ నుంచి నేరుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకొనేందుకు ఈ రహదారి దోహదం చేయనుంది.సుమారు 9 కి.మీ.మేర నిర్మాణం చేపట్టనున్నారు.ఈ రహదారిలో దాదాపు 6 నుంచి 7 కి.మీ.వరకు ఆరు లైన్ల స్టీల్‌ బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు.వాహనాలు ఎక్కడా ఆపాల్సిన అవసరం లేకుండా నగరం నడిబొడ్డున ఈ ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ రవాణా సదుపాయాన్ని అందజేయనుంది. ఇప్పటికే ఈ రోడ్డు కోసం హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోనే టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.మరో 90రోజులవ్యవధిలో ఎంపికై న కన్సల్టెన్సీ నివేదికను అందజేయవలసి ఉంటుంది. మరోవైపు షేక్‌పేట్‌ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో రహదారి నిర్మాణానికి కూడా హెచ్‌ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది.షేక్‌పేట్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మార్గంలో నేరుగా ఔటర్‌కు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డుకు, అలాగే ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి అన్ని వైపులా రీజనల్‌ రింగ్‌రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు రహదారుల అభివృద్ధి, విస్తరణకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు.

బంజారాహిల్స్‌ నుంచి శిల్పా లేఅవుట్‌కు ఎక్స్‌ప్రెస్‌ వే

షేక్‌పేట్‌ నాలా నుంచి సీబీఐటీ వరకు విశాలమైన రహదారి

శరవేగంగా సికింద్రాబాద్‌–డెయిరీఫామ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌

త్వరలో సికింద్రాబాద్‌–శామీర్‌పేట్‌ పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement