యాచారం ఎస్‌బీఐ ఎదుట ధర్నా
యాచారం: చౌదర్‌పల్లి గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం రాత్రి యాచారం ఎస్‌బీఐ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. గతంలో ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన ఝాన్సీరాణి చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన చెందిన డ్వాకా సంఘాల మహిళలకు అందాల్సిన రూ.కోట్లాది రుణాలను, కొంత మంది ఐకేపీ సిబ్బందితో కుమ్ముకై నకిలీ డాక్యుమెట్లు, ఫోర్జరీ సంతకాలతో బినామీల ఖాతాల్లో జమ చేసింది. డ్వాక్రా సంఘాల మహిళల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డీఆర్‌డీఓ అధికారులు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు పూర్తి బాధ్యత మేనేజర్ ఝాన్సీరాణినేనని మహిళలు ఆరోపిస్తున్నారు. బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీ చేత రికవరీ చేయించి మా పేర్ల మీదున్న అప్పులు చెల్లించాలని మహిళలు కొద్ది నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీ సోమవారం ఎస్‌బీఐ బ్యాంకుకు విచారణ వచ్చినట్లు తెలుసుకున్న చౌదర్‌పల్లి డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు వచ్చి బ్యాంకు గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సాగర్ హైవేపై ధర్నా చేసేందుకు యత్నిస్తుండగా యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి అక్కడకు వచ్చి మహిళలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రస్తుత మేనేజర్ మాన్యనాయక్‌ను సంప్రదించగా బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీరాణి వచ్చింది, నిజమేనని వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు.
చౌదర్‌పల్లి ఘటనలో బదిలీ అయిన మేనేజర్ నుంచి వివరాల సేకరణ
బినామీ ఖాతాలకు మళ్లించిన నిధులు చెల్లించాలని డ్వాక్రా మహిళడిమాండ్


