ఆలూరులో హామీల అమలు
చేవెళ్ల: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఆస్పత్రికి వెళ్లేందుకు ఉచిత ఆటో ప్రయాణం కల్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ఆలూరు సర్పంచ్ కౌలంపేట భాగ్యమ్మశేఖర్ గౌడ్. సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఉచిత ఆటో సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం నూతన ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసి పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారు. సేవలు వినియోగించుకునేందుకు ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. తన సొంత డబ్బులతో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తానని స్పష్టంచేశారు. గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు పి.రాంచంద్రయ్య, శ్రీశైలం, కె.ఆంజనేయులు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు నుంచే సేవలు ప్రారంభించిన నూతన సర్పంచ్
ఆలూరులో హామీల అమలు


