పాలకులకు ‘పట్టా’
షాద్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్, వార్డు సభ్యులకు గురువార ం ఆయా క్లస్టర్లలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియామక పత్రాలను అందజేశారు. ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి సర్పంచ్‌గా గోపాల్‌రెడ్డి, కొందుర్గు మండలం పాత ఆగిర్యాల సర్పంచ్‌గా యాదమ్మ, చెర్కుపల్లి సర్పంచ్‌గా యాద య్య, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌గా మంచాల అనూష, నందిగామ మండలం కన్హా సర్పంచ్‌గా మధుసూధన్, కేశంపేట మండలం దేవునిగుడితండా సర్పంచ్‌గా సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కేశంపేట: మండల పరిధిలోని దేవునిగుడితండా సర్పంచ్‌తో పాటు ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి డాక్టర్ నివేదిత గురువారం వీరికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్‌గా రవిని ఎన్నుకున్నారు. అలాగే, తూర్పుగడ్డతండాలో 07, పొల్కోనిగుట్టతండా 03, పాటిగడ్డ 02, చింతకుంటపల్లి, ఇప్పలపల్లి, లేమామిడి, ఎక్లాస్‌ఖాన్‌పేట, దత్తాయపల్లి గ్రామాల్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.
ఆర్‌ఓల సమక్షంలో ఉపసర్పంచ్‌ల ఎన్నికలు
యాలాల: మండల పరిధిలో తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీరికి గురువారం రిటర్నింగ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రాలను అందించారు. లక్ష్మీనారాయణపూర్, గంగాసాగర్, కిష్టాపూర్, బండమీది పల్లి, సంగాయగుట్ట తండా, సంగాయిపల్లి తండా, సంగెంకుర్దు, జక్కేపల్లి, పేర్కంపల్లితండాల్లో ఏకగ్రీవమైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆర్‌ఓలు ధృవీకరణ పత్రాలు అందించారు. ఆయా పంచాయతీల్లో ఆర్‌ఓల సమక్షంలో ఉప సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక నిర్వహించారు.
ఏకగ్రీవ ప్రజాప్రతినిధులకు నియామక పత్రాలు


