‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే! | - | Sakshi
Sakshi News home page

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

Dec 4 2025 9:15 AM | Updated on Dec 4 2025 9:15 AM

‘మొదట

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

మరో నాలుగు జీపీలు..

రెండో విడతలో ఇద్దరు

బంట్వారం: రెండో విడతలో కోట్‌పల్లి మండలంలోని రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండు జీపీల్లో సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వచ్చాయి. బుగ్గాపూర్‌ జనరల్‌కు రిజర్వు కాగా, బార్వాద్‌ తండా ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. బుగ్గాపూర్‌ నుంచి మహేంద్‌ దొర, బార్వాద్‌ తాండా నుంచి నెనావత్‌ శంకర్‌ సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఖాయమైంది.

తాండూరు రూరల్‌: తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒకే నామినేషన్‌ వచ్చిన పంచాయతీల వివరాలను అధికారులు వెళ్లడించారు. దీంతో ఆయా పంచాయతీలకు సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నిక దాదాపు ఖరారైంది. తాండూరు మండలంలో 33 జీలు ఉండగా ఐదు పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరన్‌కోట్‌ జీపీ నుంచి రాజ్‌కుమార్‌, రాంపూర్‌మీది తండా నుంచి వెంకట్‌రెడ్డి, వీరారెడ్డిపల్లి నుంచి పురుషోత్తం రెడ్డి, బిజ్వార్‌ నుంచి అనసూయ, చిట్టిఘనాపూర్‌ నుంచి విజయ్‌కుమార్‌ సర్పంచ్‌ కావడం దాదాపు ఖరారైంది.

పెద్దేముల్‌లో నాలుగు

పెద్దేముల్‌ మండలంలో 38 గ్రామ పంచాయతీలు ఉండగా నాలుగు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ రతన్‌సింగ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుద్రారం, చైతన్యనగర్‌, దుగ్గాపూర్‌, సిద్ధన్నమడుగు తండాలో సర్పంచ్‌ స్థానానికి ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.

ఆరు జీపీలు ఏకగ్రీవం

బొంరాస్‌పేట: మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రకియ ముగియడంతో మండలంలోని ఆరు పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. నాగిరెడ్డిపల్లి పంచాయతీ నుంచి నందిగామ అనిత, జానకంపల్లి నుంచి సానవోని చిన్నవెంకటయ్య, సాలిండాపూర్‌ జీపీ నుంచి రుక్కీబాయి, మదన్‌పల్లితండా నుంచి శంకర్‌నాయక్‌, టేకులగడ్డతండా నుంచి లక్ష్మీబాయి, కట్టుకాల్వతండా నంచి కిషన్‌నాయక్‌, పాలబాయితండా నుంచి సరోజినీబాయి సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఖాయమైంది.

పాంచ్‌ పటాకా

బషీరాబాద్‌: మండలంలో ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మంతన్‌గౌడ్‌, బాబునాయక్‌తండా, హంక్యానాయక్‌తండాల్లో సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్‌ చొప్పున దాఖలయ్యాయి. బుధవారం బాద్లాపూర్‌, నంద్యానాయక్‌ తండాల్లో పోటీ దారులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ రెండు పంచాయతీలు కూడా యూనానిమస్‌ జాబితాలో చేరారు. ఎరుకలి భీమప్ప(మంతన్‌గౌడ్‌), కంసాన్‌పల్లి నవనీత(బాద్లాపూర్‌), అనితారాథోడ్‌ (హంక్యానాయక్‌), జెర్పుల అనిత (బాబునాయక్‌ తండా), చౌహన్‌ చుమ్మీభాయి (నంద్యానాయక్‌ తండా) సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బుధవారం వీరంతా తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

నాగసార్‌ సర్పంచ్‌గా అరుణ!

దౌల్తాబాద్‌: మండలంలోని నాగసార్‌ గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. ఇక్కడ సర్పంచ్‌ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయగా బుధవారం ఒకరు ఉపసంహరించుకున్నారు. దీంతో దాదాపురం అరుణ ఎన్నిక ఖాయమైంది. 8 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి.

ఎన్నిక లాంఛనమే

దుద్యాల్‌: మండలంలోని సాగారం తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నరేశ్‌ రాథోడ్‌, ఆరుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న రవినాయక్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో నరేశ్‌ ఎన్నిక లాంఛనమైంది. బుధవారం నరేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌ సన్మానించారు.

నెనావత్‌ శంకర్‌ (బార్వాద్‌ తండా)

మహేందర్‌ దొర(బుగ్గాపూర్‌)

ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ

ఏకగ్రీవ పంచాయతీలను ప్రకటించిన అధికారులు

యాలాల: స్థానిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో ముగియడంతో మరో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే ఆరు జీపీలు ఏకగ్రీవం కాగా, మరో నాలుగు చేరాయి. బండమీదిపల్లి నుంచి నరేష్‌, జక్కేపల్లి నుంచి లాలప్ప, దేవులాతండా నుంచి మోహన్‌, సంగాయిపల్లితండా నుంచి కమలాబాయి ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నిక కానున్నారు. దేవులాతండాలో మొత్తం నాలుగు వార్డులకు గాను రెండు ఏకగ్రీవం కాగా మరో రెండు వార్డుల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోక పోవడంతో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ స్థానం మాత్రం ఏకగ్రీవమైంది.

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!1
1/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!2
2/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!3
3/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!4
4/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!5
5/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!6
6/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!7
7/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!8
8/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!9
9/9

‘మొదటి విడత’ సర్పంచ్‌లు వీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement