‘సీసీఐ’ ఆధునీకరణకు నిధులివ్వండి
కేంద్ర మంత్రి కుమారస్వామిని
కోరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామ శివారులో గల సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ఫ్యాక్టరీ ఆధునీకరణకు రూ.100 కోట్లు కేటాయించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కంపెనీ ఉద్యోగులు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఐ ఫ్యాక్టరీలో పలు పరికరాలు దెబ్బతిన్నాయని వాటిని కొనాల్సి ఉన్నందున నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకులంగా స్పందించారని ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు.
జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా
తాండూరు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. బుధవారం మండలంలోని బెల్కటూర్, గౌతాపూర్ నామినేషన్ సెంటర్లను పరిశీలించారు. నామినేషన్ పత్రాలను భద్రపరచాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, తహసీల్దార్ తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: నియోజకవర్గ సరిహద్దు కర్ణాటక రాష్ట్రం మోతక్‌పల్లి క్షేత్రంలో వెలిసిన శ్రీ బల భీమరాయుని రథోత్సవం నేడు జరగనుంది. ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పు కావడంతో భారీగా తరలి వెళ్లనున్నారు. గురువారం రాత్రి రథోత్సవం, శుక్రవారం గజోత్సవం(పూలతేరు) నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ
పూడూరు: సీఐటీయూ 5వ మహాసభలను జయప్రదం చేద్దామని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8 తేదీల్లో మెదక్ పట్టణంలో మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిద్ధం కావాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు వనజ, ఉమాదేవి, అండాలు, పుష్ప, పంచాయతీ, మధ్యాహ్న భోజన కార్మికులు అలీ, నర్సింలు, రాములు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్‌లో బుధవారం ఇరుముడి పూజ ఘనంగా జరిగింది. శివాలయం వద్ద అంజనేయులు, మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడిపూజను శబరిమల యాత్ర గురుస్వాములు ఉమాశంకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, పూలు, పండ్లు సమర్పించి.. ఇరుముళ్ల పూజ చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములు సన్నిధానం నుంచి గురుస్వాములు జైపాల్, శివకుమార్, సురేశ్, ఇంద్రసేనారెడ్డి, మైసూరారెడ్డితో పాటు 14 మంది స్వాములు ఇరుముళ్లు కట్టుకొని శబరిమల యాత్రకు బయలు దేరారు. భక్తులకు మల్కాపూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్కారెడ్డి రవీందర్‌రెడ్డి అన్నదానం నిర్వహించారు.
‘సీసీఐ’ ఆధునీకరణకు నిధులివ్వండి
‘సీసీఐ’ ఆధునీకరణకు నిధులివ్వండి


