దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి

Dec 4 2025 9:11 AM | Updated on Dec 4 2025 9:11 AM

దివ్య

దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి

అనంతగిరి: దివ్యాంగులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌ కాంక్షించారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా మహిళా సమాఖ్య సమావేశపు గదిలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా సమాజాభివృద్ధిలో అందరికీ సమాన హక్కులు కల్పించి పరిరక్షించే విధంగా కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం దివ్యాంగులకు హక్కులను కలిపించడంతో పాటు సమాజంలో వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. క్రీడాపోటీల్లో గెలుపొందన దివ్యాంగులకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, మెప్మా ఇన్‌చార్జి రవికుమార్‌, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు

దౌల్తాబాద్‌: అవయవలోపం, వైకల్యం శరీరానికేకానీ వ్యక్తిగత వికాసానికి అడ్డంకి కాదని ఎంఈఓ వెంకట్‌స్వామి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పీఎంశ్రీ పాఠశాలలో ఆట, పాటల పోటీలు నిర్వహించారు. అవయవలోపం ఉన్నవారు ఉన్నత స్థానాలను చేరుకున్నప్పుడే వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటయ్య, ఉపాధ్యాయులు సాయిలు, శానమ్మ, ప్రభాకర్‌, చంద్రశేఖర్‌, ఆనంద్‌, మొహన్‌ తదితరులు పాల్గొన్నారు.

కేక్‌ కట్‌ చేసి సంబురాలు

మర్పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ అంజిలయ్య ముఖ్య అథితిగా పాల్గొని విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి దివ్యాంగులకు తినిపించారు. అనంతరం సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి వడ్డించారు. కార్యక్రమంలో ఐఈఆర్‌పీ ఉమాదేవి, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

మనోధైర్యంతో ఉండాలి

నవాబుపేట: దివ్యాంగులు మనోధైర్యంతో ముందు కు సాగాలని ఎంఈఓ అబ్దుల్‌ రెహమాన్‌ అన్నారు. బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లేశం, కవిత, ఐఈఆర్‌పీ మురళి, వీరమణి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌

దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి 1
1/2

దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి

దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి 2
2/2

దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement